ఏదీ నీ సమాధానం.
తెలుగు నేస్తం! ఏదీ నీ సమాధానం...........
రాజకీయ చదరంగపు ఎత్తుల పైఎతుతులకు,
చిత్తుగా వొడి, పావు లాగా బలి అయ్యే దిక్కులేక, బిక్కుమనే జనానికి,
ఏదీ నీ సమాధానం...........
కూడు అని, గూడు అని, మభ్య పెట్టే ప్రభుత్వాలకు,
గోడు గోడుమని విలపించినా, పలకరించక వెక్కిరించే రంగు రంగుల పార్టీలకు,
ఏదీ నీ సమాధానం...........
చదువుల తల్లి కళ్ళకు గంతలుకట్టి, విద్యార్థిని సైతం బలిచేసే పదవీ రక్కసులకు,
ఉన్మాదుల ఆగ్రహాలకు, విద్వంసుల ఆగడాలకు బలి అయిపోయిన సామాన్యుడి, సామాన్య జీవితానికి,
ఏదీ నీ సమాధానం...........
తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఏదయితే ఏమున్నది, మన ఆస్తులను మనమే కాల్చుకుంటున్న పిచ్చి తప్ప,
ఒక్క సారి కళ్ళు తెరువు నేస్తం! మిగిలింది ఏముంది, మాతృ భూమి రోదన, బూడిదల మధ్య శవంలా పడి ఉన్న సగటు జీవి భాద తప్ప,
జై తెలంగాణ, సమైఖ్యాంధ్ర పుట్టిందే రాజకీయ నటుల కోసం,
వారి వలలో పడకు నేస్తం!
గాంధీ కోరుకుంది స్వరాజ్యమేనని,
ఇవ్వు నేస్తం నీ సమాధానం........
------------ వినోద్.
No comments:
Post a Comment