ఛిగురాకున పులకించే చినుకే నీ స్నేహం..
శృతి మాటున వికసించిన పల్లవి నీ స్నేహం..
పసినవ్వుల విరబూసిన చిరు నవ్వే నీ స్నేహం..
ఎగసి పడే కెరటాల దాగిన స్వరమే నీ స్నేహం..
ఉరుకులు తీసే సెలయేటి దూకుడు నీ స్నేహం..
నీలి సంద్రంలో దాగిన నిశ్శబ్ధం నీ స్నేహం..
సంధ్యా కాంతిలో మురిపించే సింధూర వర్ణం నీ స్నేహం..
నల్లని మబ్బుల దాగిన చల్లని వెన్నెల నీ స్నేహం..
ఛివరిగా..
నా శ్వాస నాకు దూరమైనా, నా మనసు నుంచి వీడిపోనిది నీ స్నేహం........
………. వినోద్
1 comment:
Post a Comment