Thursday, July 03, 2008

జీవితం

కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం,రెప్ప పాటు ఈ జీవితం,
గతాన్ని మరిచి, భవిష్యత్తుని చూస్తూ వర్తమానాన్ని గడిపేయ్ నేస్తం,
చనిపోతమని తెలిసి బ్రతుకు బండిని ఆశా చక్రాలతో నడిపే ఈ జీవితం,
దేవుడు నీకిచ్చిన స్వచమైన తెల్లని కాగితం,ఎన్ని కష్టాలు ఎదురయినా,
దాన్ని విజయాక్షరాలతో నింపెయ్ నేస్తం......!

--------- వినోద్.

Sunday, June 15, 2008

జీవితాంతపు మౌన భారం గుండెల్లో మోసుకోస్తున్నా,
చావులాంటి బ్రతుకును తప్పధంటూ నెట్టుకొస్తున్నా,
ఒంటరితనపు నిశీధి వీధుల్లో దిక్కు తెలియక నడిచివస్తున్నా,
తోడురాని మనుషుల కోసం జీవితం ధార పోస్తున్నా,
తోడులేని జీవిత రథాన్ని ఇలాగే ఈడ్చుకోస్తున్నా,
పగిలిన హృదయంతో కన్నీటి కడలిని గుండెల్లో దాచుకోస్తున్నా,
జీవితపు చివరి క్షణందాకా కన్నీటితోనే కలిసి వస్తున్నా,
ఎవరైనా ఒదారుస్తారేమో అని చివరి దాకా ఎదురు చూస్తున్నా,
గుండె సైతం రాయి చేసి బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నా.

--------- వినోద్.

Tuesday, February 19, 2008

Tuesday, February 05, 2008

పుడమి వడిలో ఆటలాడాలని బయటకొచ్చా,
లోకపు తీరు చూసి బాధతో కన్నీరు కార్చా,
వీడిపోని భందాలను పెంచుకుంటూ బ్రతుకు ఈడ్చా,
చివరికైనా నవ్వుతానని ఆశతో ఎదురుచూసా,
అయిన వాళ్ళకు బ్రతుకునంతా ధార పోసా,
శోక కడలిని యదలో దాచుకుంటూ కన్నుముసా....!


---- వినోద్

Thursday, January 17, 2008