జీవితాంతపు మౌన భారం గుండెల్లో మోసుకోస్తున్నా,
చావులాంటి బ్రతుకును తప్పధంటూ నెట్టుకొస్తున్నా,
ఒంటరితనపు నిశీధి వీధుల్లో దిక్కు తెలియక నడిచివస్తున్నా,
తోడురాని మనుషుల కోసం జీవితం ధార పోస్తున్నా,
తోడులేని జీవిత రథాన్ని ఇలాగే ఈడ్చుకోస్తున్నా,
పగిలిన హృదయంతో కన్నీటి కడలిని గుండెల్లో దాచుకోస్తున్నా,
జీవితపు చివరి క్షణందాకా కన్నీటితోనే కలిసి వస్తున్నా,
ఎవరైనా ఒదారుస్తారేమో అని చివరి దాకా ఎదురు చూస్తున్నా,
గుండె సైతం రాయి చేసి బ్రతుకు బండిని నెట్టుకొస్తున్నా.
--------- వినోద్.