Sunday, October 14, 2018

హౄదయమా!

ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు,
నీ హౄదయం నా దగ్గరే మరచి వెళ్ళిపోయావు.

నిన్ను మరచిపోవటానికి రోజూ ప్రయత్నిస్తునే ఉన్నాను,
కానీ నిన్ను మర్చిపోవాలనే విషయమే మర్చిపోతున్నాను.

నువ్వు లేవన్న నిజాన్ని హౄదయం నమ్మటం లేదు,
కలలో సైతం కళ్ళు నిన్ను వెతకటం ఆపటం లేదు.

జీవితం కష్టంగా ఉంది, నీ తోడు లేకుండా,
మరణం కుడా కష్టంగా ఉంది, నీ ఒడిలో తల లేకుండా.

కాలమా! ఒక్క సారి వెనక్కి వెళ్ళి అగిపోవా...
తన ఉనికిలో నన్ను విడిచి సాగిపోవా....!

                                                              ..... . వినోద్.

Monday, December 19, 2016

నా హృదయ నేస్తమా, జీవిత సగభాగమా!
నేను ఈలోకం వదలి వెళుతున్నానని నా మనసు పదే పదే నాకు గుర్తు చేస్తున్నా,
 నా భావాల్ని,నా సర్వస్వాన్ని నీకే ఇచ్చి వెళుతున్నా!
నేను నీకు దూరమైనా ఏ డవకు ,నీ కన్నీటిలో నేనున్నానని మరువకు!
నా అడుగుల గురుతులు నీ ఎద వాకిట నుంచి చెరిపెయ్యకు. నీ ప్రతి అడుగు సవ్వడిలో నేనున్నానని మరువకు!
నా పేరును నీ పేరు నుండి దూరం చెయ్యకు ,నీ పేరులోని ప్రతి అక్షరం లో నేనున్నానని మరువకు!
నీలోని నా జ్ఞాపకాల్ని తుడిచెయ్యకు, నీప్రతి తలపులో నేనున్నానని మరువకు!
నేను నీతో గడిపిన క్షణాలు నిదురలేని రాత్రులు గుర్తుకు తెచ్చుకో ఆ గుర్తులతొ నీ జీవనపయనం సాగించు!
ఏదో ఒకనాటి సాయంసంధ్య సమయాన ఏ చిరుగాలిగానో వచ్చి నిన్ను పలకరిస్తాను,
ఏదో ఒక నాటి పున్నమిరోజున వెన్నెలగా వచ్చి నిన్ను పరామర్శిస్తాను!
 నీవు లేని స్వర్గం నాకు నరకమేనని మరువకు....
                ....వినోద్

Thursday, December 13, 2012

Thursday, May 06, 2010

ఓ నవ లోకపు బాటసారి !

ఓ నవ లోకపు బాటసారి !
కదులుతోంది కదులుతోంది భూ ప్రపంచం ప్రమాదపు అంచులు దాటి

విశాల గగనంలో మేఘాలకు కన్నీరే కరువై, నిశీధి వీదుల్లో జాబిల్లే ఎరుపై,
హరిత భరిత విశ్వం లో పశు పక్ష వృక్ష జాతి అనవాలే కనుమరుగై,
నాగరికత ఎక్కువై, కాలుష్యపు కోరల్లో, దారిద్ర్యపు నీడల్లో, యువత భవిత దారి తప్పి సమాజమే జీవశ్చవమై,

కదులుతోంది కదులుతోంది భూ ప్రపంచం ప్రమాదపు అంచులు దాటి.

-- వినోద్.